top of page
Telugu Title
మా విజన్

హ్యాండ్ లెటర్స్ ఎందుకు?

Send అనే ఒక్క బటన్ తో నువ్వు చెప్పాలనుకున్న మాటలన్నింటిని నీకు కావలసిన మనిషిచే చదివించగల సౌలభ్యం..
Dial అనే ఒక్క బటన్ తో ఎక్కడో సముద్రాలకి ఆవల ఉన్న మనిషితో సైతం మాట్లాడగల సౌకర్యం.. ఇలా టెక్నాలజీ అనే పేరుతో ప్రపంచం అరచేతుల్లోకి వచ్చి వాలినా సరే ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఒక కాగితంపై స్వయంగా మన మనసులోని మాటలని ఒక మనిషికోసం ఉత్తరంగా రాస్తున్నప్పుడు, రాసిన ఆ మాటలు చదువుతూ మనలో మనం పొందే అనుభూతి అమోఘం.


అంత అద్భుతమైనది అక్షరం..అంతకు మించి అందమైనది ఉత్తరం.
మనసులోని మాటని చెప్పడంకంటే గొప్ప కానుక ఇంకొకటి ఉండదు. కాలం మారినా,కాలంతో పాటు మనిషి మారినా..కాగితంపై రాసిన అక్షరం మారదు. అది చదువుతున్న మనిషి ముఖంలో అనుభూతి మారదు. ఎంత గొప్ప వస్తువును కానుకగా ఇచ్చినా దాన్ని తలదన్నే మరోకానుక మరుసటిరోజుకల్లా మార్కెట్లోకి వచ్చేస్తుంది. కానీ ఎప్పటికీ యెదలోతుల్లో ఉండిపోయేది చేతితోవ్రాసిన లేఖ. ఎదురెదురుగా లేకపోయినా ఒకరినొకరు చూసుకునేలా చేస్తుంది ఉత్తరం,నోరు తెరచి మాట్లాడకపోయినా చెప్పాలనుకుంటున్న విషయాన్నీ మాటలుగా మార్చుకునేలా చేస్తుంది అక్షరం..
రోజుకి వందల మెసేజిలు పంపించుకోవచ్చు, గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకోవచ్చు కాకపోతే ఆ వందల మెసేజిలలో గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఎన్ని ఉన్నాయో చూసుకో ఒక్కసారి..! ఆ గంటలకొద్దీ మాట్లాడిన మాటలలో మనసుని తాకిన మాటని మళ్ళీ అలాగే అదే అనుభూతితో వినాలనుకుంటే సాధ్యమా?? ఆలోచించు ఈ సారి..!


“అదే ఒకరు మనకోసం రాసిన ఉత్తరాన్ని చదువుతుంటే…
అందులోని ప్రతి అక్షరం గుర్తుపెట్టుకునేదే.. ప్రతి మాట ఆ పంపిన మనిషి గొంతుతో మన మనసుని తాకేదే.. అది మొదటిసారి చదువుతున్నా వందో సారి చదువుతున్నా.. ఒకే అనుభూతి..” కానీ ఇప్పుడున్న గజిబిజి పరుగుల జీవితంలో ప్రతిరోజూ ఉత్తరాలు రాసుకోలేము కానీ ప్రత్యేకమైన రోజులకి కూడా మీకు ప్రత్యేకమైన మనుషులకి అందరిలా ఏ ఫోన్లోనో ఫేసుబుక్ వాట్సాప్పుల్లోనో మీరు అందరిలో ఒకరిలా wishes తెలపడం కంటే కనీసం ఆ ఒక్కరోజైనా మీ అభిప్రాయాన్ని మీ మాటలలో తెలుపుతూ ఆ మనిషి మీకు ఎంత ఇష్టమో ఆ సందర్భం మీకు ఎంత ముఖ్యమో నోరు తెరచి చెప్పకుండానే ఉత్తరంలోని మీ మాటల ద్వారా తెలియపరచడానికి ప్రయత్నించి చూడండి..!

నిజమే..! ఈ ఆలోచన బాగానే ఉన్నా కానీ కొందరు ఎలా రాయడం అనే సందేహంతో ఆగిపోతే మరికొందరు రాసే సమయం లేక పోస్ట్ చేసే వీలులేక ఆగిపోతుంటారు..అందుకే అలాంటివారికోసమే మా ఈ "కరపత్ర". ఈ కరపత్ర మీ భావాలని మా మాటల రూపంలో మీ మనిషికి చేరవేసే ఓ మధురమైన వారధి.. సందర్భం ఎటువంటిదైనా, మీరు చెప్పాలనుకున్న విషయం ఏదైనా దాన్ని మనసుకి హత్తుకునే లేఖగా మలచి మీకు కావలసిన మనిషికి చేరవేసే భాద్యత మాది. మా ఉత్తరాలని ఇండియన్ పోస్ట్ సర్వీసు ద్వారా పంపడం జరుగుతుంది. ప్రేమలేఖలు..క్షమాపణ లేఖలు.. శుభాకాంక్షలు..ఆహ్వాన లేఖలు.. ఇలా సందర్భం ఏదైనా సరే,ఒకవేళ మీరు అనుకుంటున్న విశేషం పై లిస్టులో లేకపోయినా మాతో సంప్రదిస్తే మేము మీకు నచ్చిన విధంగా లేఖలు రాయడానికి ప్రయత్నిస్తాము.

ఆలోచించండి..!
ఒక కాగితం,పది మాటలు... కేవలం ఇవి చాలు.. మీ జీవితంలోని ఒక రోజుని ప్రత్యేకంగా మార్చగలవు అని నమ్మితే మమ్మల్ని సంప్రదించండి.ఎందుకంటే మీరు పంపుతున్నది కేవలం చించేస్తే చిరిగిపోయే ఒక మామూలు ఉత్తరం కాదు,బ్రతికున్నంత కాలం దాచిపెట్టుకోగల తీపి జ్ఞాపకం.

అందించే సేవలు

సందర్భానుసార లేఖలు

  1. అభినందన లేఖ: సమాజం అంతా శభాష్ అంటూ ఆకాశానికి ఎత్తేసినా రాని ఆనందం ప్రియమైన వారు పది మాటలు పొగుడుతూ వ్రాసి పంపే ఉత్తరం తో సాధ్యం.

  2. ఓదార్పు లేఖ: కష్టాలు లో, పరాజయం పాలైనప్పుడు ప్రపంచం అంతా పరారు అయిపోయినప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పే వారు కొందరు మాత్రమే. ...మాటల్లో కన్నా రాతల్లో పంపే ఓదార్పు మీ వారి తలరాతను కూడా మారుస్తుంది. 

  3. ఆహ్వాన లేఖ: ఆహ్లాదం ,ఆనందం అనేవి ఆహ్వనం తోనే అవుతాయి ఆరంభం....మరి మీరు ఆత్మీయులకు ఉత్తరాలను పంపి ఆనందాన్ని ఆస్వాదించండి !

  4. వీడ్కోలు లేఖ: ఎన్ని వేడుకలు కలిసి జరుపుకున్నా ఎన్ని బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నా వీడ్కోలు వేదికపై ఇచ్చే లేఖ ..శాశ్వత కానుక.

  5. పదవి విరమణ లేఖ: బ్రతుకు బండి ని ఒడ్డున చేర్చి అలసిన మనస్సు కు , తరిగిన సొగసు కు మీరు పంపే పూల మాలల కన్నా ,ఉత్తరం లో అరుదైన గుర్తింపు , గౌరవం లభిస్తుంది.

శుభాకాంక్ష లేఖలు

  1. పుట్టిన రోజు లేఖ : మాట్లాడే మీ మనసు ఎదిగే వారి వయస్సు కు ఆశిస్సులు పంపాలన్న, తేజస్సు తో నింపాలన్నా ఎల్లకాలాల్లో ఉత్తరమే కానుక గా మిన్న.

  2. పెళ్లి లేఖ: ఆకాశమంతా పందిరి లో భూలోకమంత వైభవంగా వధూవరులు ఒక్కటవుతుంటే హిమాలయమంత స్వచ్ఛమైన మనసుతో మీరు శుభాకాంక్షలు తెలపాలంటే.. కాగితం , కలం పట్టాలిగా మరి.

  3. శ్రీ మంతం శుభాకాంక్షలు : నవ మాసాలు మోసి మనకు రూపాన్ని ఇచ్చే మనిషికి కి గాజులతో పాటు ఇవ్వగలిగే చిరకాల ఙాపకం ఉత్తరం. ఆవిడ కడుపులో బిడ్డ ను ఆశీర్వదించడానికి మన ఆలి , తల్లి , చెల్లి మాత్రమే కానక్కర్లేదుగా... .మరి ఇంకెందుకు ఆలస్యం.. కరపత్రను సంప్రదించండి.

  4. వార్షికోత్సవాలు,షష్టి పూర్తి మహోత్సవాలు : క్యాలెండర్ లో కాగితాలు కదిలిపోయినా అయినవారితో గడిపిన క్షణాలు కరిగిపోకుండా పదిలంగా దాచుకునే సాధనం ఉత్తరం.

దినోత్సవ లేఖలు

  • ఒక్క రోజు ముచ్చట కాదు మన మమకారాలు, మర్యాదలు ...కానీ తీరిక లేని తరుణంలో ఇలాంటి రోజుల మీద మోజు పెంచుకోవడం నవీన నాగరికత అయిపోయింది . అయినా పక్కన ఉన్న వ్యక్తి ప్రత్యేకమైన వారు అయితే ప్రతి రోజూ ప్రత్యేకమే, ప్రతి దినము పండుగే ... అలాంటి వారికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలనుంటే కరపత్రను సంప్రదించండి.

  • మాతృభాష దినోత్సవం, బాలల దినోత్సవం, మాతృత్వ దినోత్సవం, మహిళా దినోత్సవం, మొదలైనవి.... 

వృత్తి వేడుక లేఖలు

వృత్తి ఎలాంటిదైన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ ఉద్యోగమైన ఎంత జీతమైన నలుగురు హర్షించేది, హాని చేయని పని...చేస్తున్నందుకు ఒక్క రోజు మీ వారిని కార్యదీక్ష ను ఉత్తరం ద్వారా అభినందంచండి . ఇల్లు , ఇల్లాలు మాత్రమే కాదు ఇండియా అంతా ఆనందంతో అభివృద్ధి కి అడుగులు వేస్తుంది.

వైద్యుల దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, కార్మిక దినోత్సవం మొదలైనవి....

సాధారణ లేఖలు– వినోదం / విందు/ చదువు / ఎటువంటి లేఖలు అయినా కరపత్ర కుటుంబ సభ్యులు మీ కోసం, మీ వారి కోసం వ్రాస్తారు !!

Please reload

నమూనాలు
bottom of page