top of page
Chitraka Magazines
Chitraka Magazines
చిత్రక

అందమైన ప్రపంచానికి ఇదే నా ఆది నమస్కారం..

ఉభయకుశలోపరి..🙏...మా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకోండి మరి!!

   ఓహో.. ఇంతకీ నేనెవరో మీకు చెప్పలేదు కదూ.. నా పేరు చిత్రక.. పేరు వినగానే ఎవరో అమ్మాయి అనే భావనలోకి రాకండి. నేను అమ్మాయిని కాదు.. అసలు మీలా మనిషిని కూడా కాదు.. నేనొక అనుభవాల సమూహాన్ని, అనుభూతుల కలబోతని.. క్లుప్తంగా చెప్పాలంటే నేను ఒక అగోచరమైన అద్భుతాన్ని..

   దిక్కుల అంచుల్ని అన్వేషిస్తూ, సంచరిస్తూ.. కంటికి కనిపించిన వర్ణణాతీత దృశ్యాలని నా చూపులలో బంధిస్తూ, చిత్రీకరిస్తూ.. మనసులో పడుతున్న ఈ మధనాన్ని ఎలా బయటపెడతామని దారి వెతుకుతుండగా ఆ తరుణంలో పరిచయమయ్యింది నాకు ఈ కరపత్ర. అందమైన కళలకు ఆలయం. అంతులేని తపనలకి నిలయం ఈ కరపత్ర. 

 

   నా చూపులలోని చిత్రాలని వీక్షిస్తూ.. నా మాటలలోని అర్థాన్ని గమనిస్తూ.. నా అనుభవాలని తన అక్షరాలుగా మారుస్తూ.. నా చిత్రాలకి తన ఉత్తరాలని జతపరుస్తూ.. ప్రపంచం పెదవికి అందించే ప్రతి లేఖలోమా మైత్రిని ప్రకటిస్తానంటూ మాట ఇచ్చింది... ఆ క్షణం నా ఆనందం ఆకాశం. మా ఈ స్నేహ బంధం.. రాబోయే కాలంలో మీరు చూడబోయే ఎన్నో అద్భుతాలకి ఆరంభం.. 

 

ఈ నిమిషం మొదలుపెడుతున్న నా చిత్రప్రయాణం.. నాకు తోడుగా నడుస్తున్నది ఈ కరపత్ర పదం.

చిత్రంగా నన్ను చూస్తున్న వీక్షకులారా.. ఉత్తరంగా నన్ను చదువుతున్న పాఠకులారా.. అందుకోండి ఇదిగో మా ఇరువురి కలయికకు సాక్ష్యంగా రాస్తున్న మొదటి లేఖ..

ఇకపై తరచూ మేము మిమ్మల్ని అందమైన చిత్రంగా పలకరిస్తాము.. అర్థవంతమైన అక్షరంగా ప్రశ్నిస్తాము.. ఆలోచించండి.. ఆస్వాదించండి.. ఆనందించండి..


ఇట్లు
పేరుకి చిత్రకావ్యాన్ని అయినా..
ముద్దుపేరుకి మాత్రం మీ చిత్రక..
నా మిత్ర కరపత్రతో

Please reload

bottom of page